10 నాటికి టీఆర్‌ఎస్ సభ్యత్వం పూర్తి చేయాలి : కేటీఆర్

హైదరాబాద్ : తెలంగాణ భవన్‌లో సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల్ పరిధిలో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదుపై ఎమ్మెల్యేలు, పార్టీ ఇంచార్జీలతో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమై చర్చించారు. రాజధానిలో సభ్యత్వ నమోదు చురుగ్గా సాగుతోంది. ఆగస్టు 10వ తేదీ నాటికి సభ్యత్వం పూర్తి చేయాలి. 10 నుంచి 20వ తేదీ వరకు బస్తీ, డివిజన్ కమిటీలు ఏర్పాటు చేయాలి. ప్రతి కమిటీలో కనీసం 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలుండాలి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 50 వేల సభ్యత్వ నమోదు లక్ష్యంగా పని చేయాలి. చాలా నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు చురుగ్గా కొనసాగుతోంది. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నగర ప్రజల్లోకి తీసుకుపోవాలి. సీఎం కేసీఆర్ ముందుచూపు వల్లే నగరంలో తాగునీటి, విద్యుత్ కొరత లేదు. రాజకీయంగాను నగరంలో టీఆర్‌ఎస్ పార్టీకి ఎదురులేదు. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వినియోగించుకోవాలి అని కేటీఆర్ సూచించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *