నేడు, రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు

హైదరాబాద్ : వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రెండ్రోజుల్లో వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఉపరితల ఆవర్తనం వల్ల తెలంగాణలో రుతుపవనాలు మరింత చురుకుగా ముందుకు కదులుతున్నాయని చెప్పారు. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. జార్ఖండ్ దానిని ఆనుకుని ఉన్న పశ్చిమబెంగాల్ ప్రాంతాల్లో రెండ్రోజులుగా కొనసాగుతున్న అల్పపీడనం బలహీనంగా మారిందని అధికారులు తెలిపారు. కాగా, శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, వరంగల్, పెద్దపల్లి, జగిత్యాల, ములుగు, మంచిర్యాల, నిర్మల్, ఖమ్మం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *