టిక్‌టాక్ యూజర్ల డేటా ఇకపై భారత సర్వర్లలోనే..!

ప్రముఖ సోషల్ యాప్ టిక్‌టాక్ మాతృ సంస్థ అయిన బైట్ డ్యాన్స్ త్వరలో భారత్‌లో తన డేటా సెంటర్‌ను ప్రారంభించనుంది. భారత వినియోగదారుల డేటా ఇక్కడి సర్వర్లలోనే నిక్షిప్తం చేయాలంటూ భారత ప్రభుత్వం తెచ్చిన ఒత్తిడి మేరకు బైట్ డ్యాన్స్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే దాదాపుగా 100 మిలియన్ డాలర్ల (దాదాపుగా రూ.700 కోట్లు) అంచనా వ్యయంతో 6 నుంచి 18 నెలల కాలంలో బైట్ డ్యాన్స్ భారత్‌లో తన డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. 

ఇక రానున్న 3 ఏళ్ల కాలంలో బైట్‌డ్యాన్స్ భారత్‌లో 1 బిలియన్ డాలర్ల (దాదాపుగా రూ.7వేల కోట్లు)ను పెట్టుబడి పెట్టనుంది. ప్రస్తుతం టిక్‌టాక్ యాప్‌కు గాను భారత్‌లో 200 మిలియన్ల మంది యూజర్లు ఉండగా.. గతంలో ఈ యాప్ పట్ల పలు వివాదాల ఏర్పడ్డాయి. యాప్‌లో కొందరు పోస్ట్ చేస్తున్న అసభ్యకర దృశ్యాలు చిన్నారులపై ప్రభావం చూపిస్తున్నాయనే ఆరోపణలో కొంత కాలం టిక్‌టాక్ యాప్‌ను సుప్రీం కోర్టు నిషేధించింది. ఆ తరువాత అందులో ఉన్న పలు వీడియోలను తొలగించడంతో ఆ యాప్‌కు మళ్లీ అనుమతినిచ్చారు. కాగా ప్రస్తుతం భారత్‌లో ఉన్న టిక్‌టాక్ యూజర్ల డేటా అమెరికా, సింగపూర్‌లలో ఉన్న బైట్‌డ్యాన్స్ సర్వర్లలో నిక్షిప్తమతున్నది. భారత్‌లో డేటా సెంటర్ ఏర్పాటైతే ఇక్కడి స్వర్లర్లలోనే యూజర్ల డేటాను స్టోర్ చేస్తారు..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *