తెలంగాణలో మరో మూడు వ్యవసాయ కళాశాలలు

మామిళ్లగూడెం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వచ్చే విద్యా సంవత్సరానికి రాష్ట్రంలో మరో మూడు వ్యవసాయ విద్యా కళాశాలల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నామని ఫ్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ వీ ప్రవీణ్‌రావు అన్నారు. రెండో సారీ విశ్వ విద్యాలయం వీసీగా బాధ్యతలు తీసుకుని ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో కేవలం మూడు వ్యవసాయ విద్య కళాశాలలు మాత్రమే ఉండేవి కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ ప్రభుత్వం సహకారంతో ఇప్పటికే మరో నాలుగు నూతన కళాశాలలు ఏర్పాటు చేశామన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని ప్రస్థుత వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు అనుగుణంగా ఉండేందుకు పాఠ్యాంశాలను సిద్ధం చేస్తున్నామన్నారు. దీనికి విశ్రాంత వీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని నియమించామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ, దాని అనుబంధ రంగాల కోర్సులలో విద్యను అభ్యసించేందుకు విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున పోటీ పెరిగిందన్నారు. అందుకే ప్రస్థుతం ఉన్న వ్యవసాయ కళాశాలలో అదనంగా ఈ విద్యా సంవత్సరానికి మరో 60సీట్లు పెంచామన్నారు. డిఫ్లోమా కోర్సులు చదువుతన్న విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమలతో వారి పాఠ్యాంశాలను అనుసంధానం చేస్తున్నామన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *