అమెజాన్‌లో శాంసంగ్ స్పెషల్ సేల్.. ఫోన్లపై తగ్గింపు ధరలు..

ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ వెబ్‌సైట్‌లో శాంసంగ్ ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా పలు శాంసంగ్ ఫోన్లపై రాయితీలను అందిస్తున్నారు. సేల్‌లో గెలాక్సీ ఎం30 స్మార్ట్‌ఫోన్ రూ.1వేయి తగ్గింపు ధరతో రూ.13,990 ప్రారంభ ధరకు లభిస్తున్నది. అలాగే శాంసంగ్ గెలాక్సీ ఎం20పై కూడా రూ.1వేయి తగ్గింపు ధరను అందిస్తున్నారు. దీంతో ఈ ఫోన్‌ను రూ.11,990 ప్రారంభ ధరకు వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. అలాగే గెలాక్సీ ఎం40 ఫోన్‌పై రూ.7800 వరకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు. దీంతోపాటు ఈ ఫోన్లను కొనుగోలు చేసిన వారికి జియో, వొడాఫోన్‌లు అదనపు డేటాను ఉచితంగా కూడా అందిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *