షెడ్యూల్ రిలీజ్ : ఏపీ, తెలంగాణలో 26న ఎమ్మెల్సీ ఎన్నికలు

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఏపీలో 3, తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏపీలో కరణం బలరాం, ఆళ్ల నాని, వీరభద్రస్వామి రాజీనామాతో ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. తెలంగాణలో యాదవ్ రెడ్డిపై అనర్హత వేటుతో ఒక స్థానం ఖాళీ అయ్యింది. ఈ స్థానాలకు ఆగస్టు 26న పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ చేస్తారు.

* ఆగస్టు 7న నోటిఫికేషన్
* నామినేషన్లకు చివరి తేదీ ఆగస్టు 14
* ఆగస్టు 16న నామినేషన్ల పరిశీలన
* నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఆగస్టు 19
* ఆగస్టు 26న పోలింగ్.. అదే రోజు సాయంత్రం కౌంటింగ్
* ఉ.9 గంటల నుంచి సా.4గంటల వరకు పోలింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *