నేడు లాల్ దర్వాజ బోనాలు

హైదరాబాద్: పాతబస్తీ లాల్ దర్వాజ సింహవాహిని ఆలయంతో పాటు నగరం లోని పలు ప్రాంతాల్లో బోనాల వేడుకలకు ఏర్పాట్లు చేశారు. మహానగరం పరిధిలో సుమారు 2500 ఆలయాల్లో ఆషాఢ మాసంలో బోనాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రసిద్ధి గాంచిన పాతబస్తీలోని లాల్ దర్వాజలో కొలువైన సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో నేడు బోనాల జాతర జరుగనుంది. ఇందుకు ఆలయ కమిటీ, అధికార యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. 

ఆదివారం హరిబౌలిలోని అక్కన్న మాదన్న ఆలయం, శ్రీ సింహవాహిని ఆలయం,లాల్ దర్వాజ, మీరాలం మండిలోని మహంకాళి, చార్మినార్ పరిధిలోని భాగ్యలక్ష్మీ, కార్వాన్‌లోని దర్బార్ మైసమ్మ,సబ్జి మండిలోని నల్ల పోచమ్మ, మహంకాళమ్మ, చిలకలగూడలోని కట్ట మైసమ్మ, బాలంరాయి దండు మారెమ్మ ఆలయాల్లో బోనాలు జరుగనున్నాయి. 

పట్టు వస్ర్తాలు సమర్పించనున్న మంత్రులు, డిప్యూటీ స్పీకర్ 

ఆదివారం పలు ఆలయాల్లోని అమ్మవార్లకు ప్రభుత్వం తరపున హోంమంత్రి మహమూద్ అలీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశు సంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ వివిధ ఆలయాల్లో పట్టు వస్ర్తాలు సమర్పించి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అందులో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *