కేసీఆరే సీఎం కావాలి

లంగాణను చిమ్మంజీకట్లు కమ్ముకుంటాయనీ.. సమైక్య రాష్ట్ర సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేశారు! కానీ ఇప్పుడు చూడండి. వెలుగు రేఖలతో తెలంగాణ ఎట్లా విరాజిల్లుతున్నదో.. 24 గంటల ఉచిత విద్యుత్‌తో దేశానికే గర్వకారణంగా తెలంగాణ నిలుస్తున్నదనీ.. మల్లా టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించి కేసీఆర్ సీఎం అయితేనే.. రాష్ట్రం మరింత ప్రగతి సాధిస్తుందంటున్న పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి మనసులోమాట!

స్వామినాథన్ మెచ్చుకున్నారు

రైతులకు 24 గంటల ఉచిత కరంట్ ఎవరిస్తున్నా రు దేశంలో? కేసీఆర్‌గారు ఇస్తున్నారు. ఒకసారి ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ కేసీఆర్‌కు ఫోన్‌చేసి రైతులకు, ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నారని అభినందించారు. రైతు పక్షపాతి అయిన కేసీఆర్ సల్లంగా ఉండాలని స్వామినాథన్ ఆశీర్వదించారు. 2004 సంవత్సరానికి ముందు రైతుల ఆత్మహత్యలు పెరిగిపోవడంతో వాటికి పరిష్కారంగా ఎలాంటి చర్యలు చేపట్టాలని యూపీఏ ప్రభుత్వం స్వామినాథన్ కమిటీని ఏర్పాటుచేసింది. 2007లో రైతుల మేలు కోసం స్వామినాథన్ ఎన్నో అద్భుతమైన సిఫార్సులు చేశారు. అలాంటి స్వామినాథన్ కేసీఆర్‌ను అభినందించ డం మామూలు విషయం కాదు. ఆయనతోపా టు అనేకమంది కేసీఆర్‌ను ప్రశంసిస్తున్నారు.

రైతులకు వరం రైతుబంధు

దేశంలో ఏ ప్రభుత్వం చేపట్టనన్ని సంక్షేమపథకా లు కేసీఆర్ చేపట్టారు. రైతు సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఆయన ప్రవేశపెట్టిన రైతుబీమా, రైతుబంధు పథకాలు అద్భుతం. పంట పెట్టుబడి సాయంగా ఎనిమిది వేల రూపాయలు రైతుకు అందిస్తుండటం గొప్ప పథకం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే ఓ చారిత్రక నిర్మాణం. ఇత ర రాష్ర్టాలతో పాటు విదేశాల వారు ఈ ప్రాజెక్ట్‌ను నభూతోనభవిష్యతిగా అభివర్ణిస్తున్నారు. కేంద్రప్రభుత్వంతో పాటు ఇతర రాష్ర్టాల వారు కేసీఆర్ ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథతో పాటు ఇతర పథకాలన్నింటినీ మెచ్చుకుంటున్నారు. తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్రలోని నాందేడ్ రైతులు తాము తెలంగాణలో అంతర్భాగం అయితే బాగుండునని, తమకు ఈ సంక్షేమ పథకాలు వర్తించేవని కోరుకునేంతగా గొప్పగా కేసీఆర్ పథకాలు ఉంటున్నాయి.

పథకాలు ఆసరా అవుతున్నాయి

రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలో దేశవ్యాప్తంగా వరి బాగా పండే ప్రదేశాల్ని కేంద్రం పద్నాలుగు జోనల్స్‌గా ప్రకటించింది. వాటిలో దక్షిణాది రాష్ర్టాల నుంచి ఏపీలోని పశ్చిమగోదావరి, తమిళనాడు నుంచి తంజావూరు ప్రాతినిధ్యం వహించాయి. ఈ రోజున దక్షిణాదిలో వరి బాగా పండించే ప్రదేశాల్లో తెలంగాణలోని కరీనంగర్ జిల్లా చోటు దక్కించుకుంది. సరైన సమయంలో వర్షాలు కురువడం, రైతుల శ్రమకు తెలంగాణ ప్రభుత్వ పథకాలు ఆసరాగా నిలుస్తున్నాయి.

కేసీఆరే రావాలి

దేశంలో ఒకప్పుడు వ్యవసాయరంగం 75% వాటా ఉండేది. కానీ నేడు అది 52% తగ్గింది. అందులో 40% కౌలురైతులే ఉన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కౌలు రైతులకు రైతు బంధు పథకాన్ని వర్తింపజేయాలని కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నాను. మళ్లీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

దేశ రాజకీయాల్లోకి వెళ్లాలి

దేశరాజకీయాల్లో కేసీఆర్ కీలక పాత్ర వహించాలి. ఫెడరల్ లక్ష్యాల్ని కాపాడటం కోసం, ఫెడరల్ స్ఫూర్తిని నింపడం కోసం తన పాత్రను సమర్థ్థవం తంగా నిర్వర్తించాలి. దేశం నలుమూలలా డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని రైతు ఉద్యమాలు జరుగుతున్నాయి. కేసీఆర్ మంచి పరిపాలకుడు. అంతకంటే ముం దు ఆయన గొప్ప ఉద్యమ నాయకుడు. రైతుల హక్కులను కాపాడటానికి జరుగుతున్న పోరాటాల్లో ఉద్యమకారుడిగా రైతుల హక్కుల పరిరక్షణ కోసం కృషిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *