తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండి ఉన్నాయి. వైకుంఠం వెలుపల సైతం కిలోమీటరు మేర భక్తులు బారులు తీరారు. శ్రీనివాసుడి సాధారణ సర్వదర్శనానికి 24 గంటల సమయం, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. శ్రీవారిని నిన్న 70,028 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారికి 35,821 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.87కోట్లు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *