ర‌విశాస్త్రి మ‌ళ్లీ ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సిందే..

హైద‌రాబాద్‌: భార‌త క్రికెట్ కోచ్ ర‌విశాస్త్రి కాంట్రాక్టును పొడిగించారు. వ‌ర‌ల్డ్‌క‌ప్ త‌ర్వాత ఆగ‌స్టు 3 నుంచి జ‌ర‌గ‌నున్న వెస్టిండీస్ టూర్‌కు ఇండియా వెళ్ల‌నున్న‌ది. ఆ టూర్ కోసం 45 రోజుల పాటు కోచింగ్ టీమ్‌కు ఎక్స్‌టెన్ష‌న్ ఇచ్చారు. అయితే కోచ్ ర‌విశాస్త్రితో పాటు స‌పోర్ట్ స్టాఫ్‌గా ఉన్న వారంద‌రూ విండీస్ టూర్ ముగియ‌గానే మ‌ళ్లీ బీసీసీఐకి ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. టీమిండియా కోచ్ ర‌విశాస్త్రి, బౌలింగ్ కోచ్ భ‌ర‌త్ అరుణ్‌, బ్యాటింగ్ కోచ్ సంజ‌య్ బంగ‌ర్‌, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధ‌ర్‌ల‌కు ప్ర‌స్తుతం పొడిగింపు ఇచ్చినా.. వీళ్లంతా మ‌ళ్లీ కాంట్రాక్టు పొడ‌గింపు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సిందే. వ‌రల్డ్‌క‌ప్‌లో ట్రైన‌ర్‌గా ఉన్న శంక‌ర్ బాసు, ఫిజియోగా ఉన్న ప్యాట్రిక్ ఫ‌ర్‌హార్ట్‌లు టీమిండియాకు గుడ్‌బై చెప్పారు. వీరి స్థానంలో కొత్త వారిని తీసుకోనున్నారు. విందీస్ టూర్ త‌ర్వాత సెప్టెంబ‌ర్ 15వ తేదీ నుంచి సౌతాఫ్రికా సిరీస్ ప్రారంభంకానున్న‌ది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *