గోదావరిఖనిలో కాళేశ్వరం జలజాతర

-నిన్నటిదాకా నీళ్లే రావన్నరు.. నేడు ఖర్చెక్కువ అంటున్నరు: మంత్రి కొప్పుల
-గోదావరిఖనిలో ఘనంగా కాళేశ్వరం జలజాతర

మంథని/ఫెర్టిలైజర్‌సిటీ/యైటిైంక్లెన్‌కాలనీ: డబ్బు ఖర్చుపెట్టకుండా ఏదైనా జరుగుతుందా.. వంద రూపాయల ప్రయోజనం కలగాలంటే పది రూపాయలయినా ఖర్చుపెట్టొద్దా.. కుండల అన్నం కుండలే ఉంటే పిల్లాడు ఎట్ల పెరుగుతడు.. కాంగ్రెస్ నాయకులు మూర్ఖంగా మాట్లాడుతున్నరు అని సంక్షేమశాఖమంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో గోదావరి తీరంలో నిర్వహించిన కాళేశ్వరం జలజాతర కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రాణహిత జలాలను ఒడిసిపట్టి తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకే సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని తెలిపారు. ఎదురెక్కి నీళ్లువస్త యా..? అని ఎద్దేవా చేసినవారు.. నీరు ఎదురెక్కుతుంటే నేడు వేలకోట్ల ఖర్చుఅంటున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఎందుకివ్వలేదో బీజేపీ నా యకులు తెలంగాణ ప్రజలకు చెప్పాలని డి మాండ్ చేశారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ మా ట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు జలాలను మంథని, పెద్దపల్లి, రామగుండం, ధర్మపురి నియోజకవర్గాలకు సాగు నీటిని అందిం చేందుకు రూ. 35 కోట్లతో వరద కాల్వ లింక్ కెనాల్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ వెంకటేశ్ నేత, జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, దివాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Suman-koppulaeshwar2

జనసంద్రమైన జలజాతర

కాళేశ్వర జలజాతర జనజాతరగా మారింది. రైతులు, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్యే బాల్కసుమన్‌నదీమాతకు పసుపు, కుంకుమ, సారెను సమర్పించారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు పాలతోఅభిషేకం చేశారు. భారీగా తరలివచ్చినవారితో వారు సామూహిక వనభోజనాలు చేశా రు. 10వేల మంది కోసం ప్రత్యేకంగా వంట లు సిద్ధంచేశారు. బతుకమ్మలు, బోనాలు, కోలాటం, గుస్సాడీ, ఒగ్గుడోలు నృత్యాలు, పోతరాజుల విన్యాసాలు, కళాకారుల ఆట, పాటలు అలరించాయి. 

Suman-koppulaeshwar1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *