రిపేర్ చేస్తే బుల్లెట్ దిగాల్సిందే!

మగవారి పనిగా భావించే గన్స్ రిపేర్ వృత్తిని చేపట్టడం అంత సులువేం కాదంటున్నారు నేపాల్‌కు చెందిన లీలా కాప్లే, హిమా పోఖ్రాల్, అస్మితా ఆచార్య, కుస్ కుమారి థాపా అనే నలుగురు మహిళలు. నేపాల్ సైన్యంలో తుపాకులకు మరమ్మతులు చేసేది ఈ నలుగురు మహిళలే. నేపాల్ ఆర్మీలో గన్స్ రిపేర్ చేసే వారిలో మొదటి మహిళ అయినందుకు లీలా కాప్లే చాలా గర్వపడుతున్నది. ఈ పని ఆర్మీలో తప్ప మరెక్కడా నేర్చుకోలేనిది. ఇందులో నిబద్ధత చాలా అవసరం. ఎందుకంటే తుపాకీ పేల్చినపుడు కచ్చితంగా గురి పెట్టిన చోటే తగలాలి. రిపేర్‌లో చిన్న పొరపాటు జరిగినా పక్కవారి ప్రాణాలు తీస్తుంది. పురుషులు యుద్ధభూమిలో పోరాడుతున్నప్పుడు మహిళలు తుపాకులను ఎందుకు రిపేర్ చేయకూడదని అనిపించింది లీలా కాప్లేకు. పురుషులతో సమానంగా పనిచేయాలన్న భావనతో ఈ వృత్తిని ఎంచుకున్నది. ఆర్మీ శిక్షణ ప్రారంభంలో తుపాకీలు ఎక్కువగా వాడడంతో వాటి తయారీపై సందేహాలతోపాటు ఆసక్తి మొదలైంది. ఆ ఉత్సాహంతోనే గన్స్ మెయింటెనెన్స్ విభాగాన్ని ఉద్యోగంగా ఎంచుకున్నది. ఈ వృత్తిలో విదేశీ మహిళలను ఆదర్శంగా తీసుకున్నది. ఆర్మీలో పనిచేయడానికి మహిళలు చాలామందే ఉన్నారు. కానీ తుపాకీలు తయారు చేసేవారు, బాగు చేసేవారు కేవలం నలుగురే ఉన్నారంటున్నది లీలా కాప్లే. వీరి సంఖ్య మరింత పెరిగితే ఈ రంగంలో కూడా మంచి అవకాశాలు ఉంటాయంటున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *