ఏపీ గవర్నర్‌గా విశ్వభూషణ్ హరిచందన్‌

ఏపీ గవర్నర్‌గా విశ్వభూషణ్ హరిచందన్‌ను నియమించింది కేంద్రం. ఇందుకు సంబంధించి రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఒడిషాకు చెందిన బీజేపీ సీనియర్ నేత హరిచందన్… ఆ రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు కృషి చేశారు. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పని చేయడంతో పాటు ఒడిషా ప్రభుత్వంలో మంత్రిగానూ ఆయన పని చేశారు. జనసంఘ్‌లో పని చేసిన విశ్వభూషణ్ హరిచందన్… ఆ తరువాత బీజేపీలోనూ క్రియాశీలక పాత్ర పోషించారు. ఒడిషా న్యాయశాఖమంత్రిగా పని చేశారు. ఏపీకి విశ్వభూషణ్ హరిచందన్‌ను గవర్నర్‌గా నియమించిన కేంద్రం… ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా అనసూయ సుశీని నియమించింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *